అమ్మ  కావాలి  !!
3188
9
322
|   May 13, 2017
అమ్మ  కావాలి  !!

అందమైన బార్బీ బొమ్మ జుట్టుని చిన్న దువ్వెనతోటి దువ్వుతోంది బన్నీ . చాలా బాగుంది బార్బీ , చాలా అందంగా ఉందిరా నీలాగా అని నేనంటే ముసిముసిగా నవ్వి బుగ్గలు పూరించింది .

 పెద్దయితే నువ్వు ఇంతకంటే అందంగా ఉంటావు బంగారు అన్నాను.

 బార్బీ పెద్ద అవలేదు అంది , మరి ? బార్బీ ఇంకా చిన్న పాపే గౌను వేస్కుంది చూడు , నవ్వేశాను.

'అమ్మా మనం ఇప్పుడు ఆడుకోవాలి' అంది .

ఓ...తప్పకుండా చిట్టితల్లీ ఏం ఆట ఆడతావు ? 

అమ్మ ఇంకా పాప ఆట .

ఓకే...మరి అమ్మ ఎవరు ఆటలో ?

నేనే ఇంకా పాపేమో బార్బీ ..

అవునా అయితే మరి నేను ఎవరు ?

నువ్వా నువ్వు అమ్మమ్మవి ,

ఓ... అయితే సరే !

మరైతే నాకు చీరె కట్టు. 

నా చుడిదార్ చున్నీ ఒక అంచు తన స్కర్ట్ లోకి మడిచి వెనుక నుండి తిప్పి భుజం మీదుగా రెండో వేపు పమిట లాగ వేశాను.

వెంటనే తనో చిన్న హ్యాండ్బ్యాగ్ తగిలించుకుని నా చెప్పుల్లోకి చిట్టి పాదాలు దూర్చింది

అయ్యో నాన్నా నా చెప్పులు నీకు పెద్దవి అవుతాయి తట్టుకుని పడిపోతావు! 

ఎం పరవాలేదు నేను ఇవే వేస్కుంటా అంతే !!!

ఇపుడు నేను ఆఫీస్ కి వెళ్తానుట నువ్వేమో పాపని "జాగ్రత్తగా" చూస్తావుట సరేనా ?

సరే చూస్తాను మరి ఒకవేళ ఏడిస్తే ఎం చేయాలి నేను ?

 నువ్వు పాపకి చెప్పు పాలు తాగి హాయిగా కాసేపు బజ్జో అమ్మ వచ్చేస్తుంది, ఇంకా అమ్మమ్మ బొజ్జ మీద చేయి వేస్కో అమ్మ వచ్చేదాకా అని చెప్పాలి ఓకే ?

నాకు కళ్ళలో సన్నగా నీరు వూరుతోంది సరే అలాగే చెప్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మరి ఆఫీస్ కి అన్నాను.

సరే నేను గేట్ దగ్గరకి వెళ్ళేదాకా బై చెప్తూ ఉంటాను నువ్వు పాప కూడా బై చెప్తూనే ఉండాలి నాకు!

సరే తప్పకుండా! 

పెద్ద హాల్ దాటుకుని వాష్ ఏరియా ఉన్న గ్రిల్ వరండా లోకి వెళ్లి నిల్చుంది .

బొమ్మ ఫోన్ తీసింది ,

నాకే ఫోన్ , హలో అమ్మా పాప ఎం చేస్తోంది ? ఏడవటం లేదు కదా ?నిన్నేమీ ఇబ్బంది పెట్టటం లేదు కదా ?

లేదమ్మా హాయిగా ఆడుకుంటోంది నువ్వేమి వర్రీ అవ్వకు,

ఓకే నాకు ఇక్కడ కాస్త బిజీగా ఉంది మళ్ళీ చేస్తాను ఫోన్ .

కాసేపయింది నువ్వు చేయి నాకు ఫోన్ అని సైగ చేసింది.

చేశాను హలో ఎప్పుడొస్తావమ్మా నువ్వు ? పాప ఎదురు చూస్తోంది నీకోసం 

వచ్చేస్తాను అయిపోవచ్చింది .

పాప ఏడుస్తోందమ్మా త్వరగా వచ్చేయి నువ్వు కావాలంటోంది.

ఆ వస్తున్నా అని కదలకుండా అలాగే నిల్చుంది.

నేను మళ్ళీ ఫోన్ తీసి కాల్ చేసినట్టు నటించి హలో రామ్మా పాప ఏడుపు ఆపట్లేదు అమ్మ బెంగేమో అన్నా.

ఆ వస్తున్నా ఇదిగో ఇప్పుడే అక్కడ ఉన్నట్టు వచ్చేస్తాను.

ఏమిటో పమిట సవరించుకుంటూ బాగ్ సవరిస్తూ వాచ్ లో టైం చూస్తూ ఆటే తిరిగి నిల్చుంది రాకుండా!

కాసేపాగి చాలా హడావిడిగా వఛ్చి ఒక్క ఉదుటున బొమ్మని ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ వచ్చేశాను బంగారం ఆఫీస్ లో కాస్త లేట్ అయింది అన్నది .

నా గుండె నీరు కారిపోయింది తన మనసులో ఎలా ఉన్నదీ , చెప్పకనే చెపుతోంది మాటలు తెలీలా చేతలతో చెపుతోంది నన్ను చాలా మిస్ అవుతున్నా అని .ఏడుపొచ్చేసింది నాకు .

నాకు వెళ్లక తప్పదు వేడినీళ్లకు చన్నీళ్ళు మరి!

అమ్మమ్మ ఉన్నా ఎంతమంది ఉన్నాఅమ్మంటే ఆ చిట్టి గుండెలో ప్రేమ మమకారం అపరిమితం .

అపరాధ భావన ఈ రోజుకీ మనసులో నిక్షిప్తంగానే ఉంది , ఎంత తన భవిష్యత్తుకోసమే తనని వదిలి వెళ్లినా , శ్రమ పడినాకూడా .

సారీ బంగారు తల్లీ ! నీ ప్రేమే అమ్మగా నాకు పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది ! 

మాతృమూర్తులందరికి వారి నిర్వ్యాజమైన ప్రేమ మమకారాలకి నీరాజనాలు అర్పిస్తూ మాతృ దినోత్సవ శ���భాకాంక్షలు.!!!

Read More

This article was posted in the below categories. Follow them to read similar posts.
LEAVE A COMMENT
Enter Your Email Address to Receive our Most Popular Blog of the Day