ఆమే.....ఓ స్ఫూర్తి
522
10
|   May 14, 2017
ఆమే.....ఓ స్ఫూర్తి

     ఆమె అంటే అవని, ఆమె అంటే ప్రకృతి, ఆమె లేని సృష్టి లేదు, ఆమె లేకపోతే ప్రతిసృష్టే లేదు. అలాంటి స్త్రీ ని అమ్మగా, ఆదిశ

క్తిగా కొలిచే దేశంలో వున్న మనం ఆకాశంలో ఆమే సగం అంటూనే, అడుగడుగునా ఆమెను అణగదొక్కుతున్నం .ఒక మహిళగా, అమ్మగా ఆమెను కొలిచే రొజు ఉండడం ఒక రకంగా సంతొషించదగ్గ  విషయమే.

        

       ఆమె ఆమెకే స్పూర్తిదాయకం. తనను తానుగా నిరూపించుకుంటూ  పదిమందికి పూలబాటను చూపిస్తుంది.

           

       అలా నేను చూసిన మహిళ గురించి గుర్తుచేసుకునే ప్రయత్నంలో భాగంగా  ఈ చిన్ని ప్రయత్నం.

 

      ఆమె సత్యవతి, పేరుకు తగ్గట్టుగనే సత్యానికి మారుపేరు. సత్య తండ్రి వృత్తి  పరంగా పదిమందికి విద్యచెప్పే వృత్తిలో వున్న తన బిడ్డ మాత్రం విద్యవంతురాలు కావాలని ఆలోచించలేదు. దానికి కారణం పుట్టి పెరిగిన పల్లేటూరు, అందునా ఇక పిల్ల పెద్దమనిషయిందంటే చాలు, ఇక పెల్లేప్పుడు అని అడిగే ప్రశ్నలకు సమాధానమే పదహారేల్ల సత్య వివాహం. పాపం సగటు తండ్రి, అరడజను సంతానం కలిగిన భరతమాత ముద్దు బిడ్డ, అదే ,సంతానమే నిజమైన సంపదగా నమ్మే అసలు సిసలైన సగటు భరతీయుడు, నిజంగానే భారతీయుడే, బిడ్డ తగ్గ తండ్రొ, తండ్రి తగ్గ బిడ్డొ తెలీదు కాని దొందు దొందే .

        

           అత్తవారింట అడుగు పెట్టిన సత్య కు తన ఉనికేంటో తెలియడానికి ఒక్కసారి తెల్లవారినంత సమయం పట్టలేదు. అక్కడా అరడజను సంతానమే, పెద్ద బిడ్డగా పుట్టిన తాను పెద్ద కొడలిగ వెళ్ళి పెద్ద పెద్ద పనులే చేయల్సివచ్హింది.తనకంటే వయసులో పెద్దవాళ్ళయిన అడబిడ్డలున్న,వారికెప్పుడూ తాను చిన్న దానిగా తోచకపొవడం తనకిచ్చె మర్యాద అనుకుంటే పొరపాటే. వయసులో చిన్నైన వరసలో పెద్ద కదా, అందుకే అలుకు చల్లే క్రమం నుండి, ఆదమరచి నిద్రించే వరకు ప్రతీ క్షణం ఆమె సూర్య,చంద్రుల్ని ఓడించేది. సూర్యున్ని నిద్రలేపేది, చంద్రున్ని నిద్రపుచ్చేది.

 

           జీవమున్న తనను కళ్ళతోనే కాటికి పంపే అత్తగారు, తల్లి మాట జవదాటని తనయుడైన తాళి కట్టిన భర్త. పోని ఏకంతంలోనైన ఏమైన ఏకరువు పేట్టుకుందామంటే, అతని మనసుకు మనసే లేదు. ఇక స్నేహితురాళ్ళ ఉండాల్సిన ఆడపడుచులు, ఆర్డర్లేసే విద్యలో తర్ఫీదు పొందినట్టు వారి పాత్రను రసవత్తరంగా పొషించేవారు.

 

            కాలగమనంలో యేళ్ళు దొర్లాయి.సత్య ఇద్దరు పిల్లల తల్లయింది. తనకంటే పెద్దవారైన ఆడబిడ్డలు చదువుకోని టీచర్లుగ, డాక్టర్లుగా, స్థిరపడ్డారు. వారి స్థితి పేరిగిన కొద్ది సత్యకు వేదింపులు పెరగసాగాయి.వయసు ముదిరినా వారికి పెళ్ళిళ్ళు కాలేదని అత్త ఆరళ్ళు అంతకంతకు యజ్ఞజ్వాలల్ల పెరగసాగాయి. నెమ్మదిగా ఒక్కక్కరికి వివాహం కావడం,వివాహం అయినవారు కాణ్పు కు రావడం,షరా మాములు అయిపోయింది.

            

             తన జీవనచక్రంలో వచ్చిన అతి కొద్ది సంతోషాలైన (అంటే)  అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి, వెళ్ళడం చెళ్ళెళ్ళతో, తమ్ముళ్ళతో గడపడం ఆనందాన్ని మిగిల్చితే, తనను చూసి పదవతరగతైన పూర్తి కాని తమ్ముడు,అక్క నువ్వు వచ్చేయ్ నేను నిన్ను బాగా చూసుకుంటానని అనడం, అత్తగారికి భయపడి కన్న బిడ్డను చూడ్డనికి వచ్చిన నాన్న తన కంట పడకుండా పది అడుగుల దూరంలో ఉన్న రోడ్డు అవతల నుంచి తడి ఆరని కళ్ళతో ఆశీర్వదించడం, పండక్కు వెళ్ళి వచ్చిన ప్రతీసారి మంగళవారమనో, గాతవారమనో, అష్టమనో అష్టవంకలు పెట్టే అత్తగారంతే సత్యకు చచ్చేంత భయం పట్టుకొవడానికి పట్టుకొమ్మలయ్యాయంటే  పెద్దగా వింతపడాల్సిందేంలేదు.     

 

కొన్నేళ్ళ తర్వాత మరిదికి పెళ్ళి కావడం విద్యవంతురాలైన తోటికోడలు రావడం, ఇంట్లోని అన్యాయాన్ని ఎదిరించడమే కాక తనపై కూడ పెత్తనాన్ని చేలాయించడంతో సత్య తన మూగ నోముకు తిలోదకాలిచ్చింది. తన హక్కులకై పోరాటాన్ని కొద్ది కొద్దిగా ప్రారంభించింది.తన బిడ్డల విద్యకై శ్రమించి,కూతుర్ని,ఉన్నతవిద్యవంతురాలిని చేసింది.తమ్ముడు తన స్వార్థం చూసుకుని ఇంట్లోంచి వెళ్ళిపొవడంతో దెబ్బతిన్న భర్తను బిడ్డల లాలించి,తల్లి కోసం తల్లడిల్లే పిల్లడిలా తన ప్రేమలో బంధించింది.రెండో కోడలి ప్రవర్తనతో బుద్దొచ్చిన అత్తను తన సేవతో మెప్పించి,తాను లేకుండా ఆమే ప్రాణం కూడ వదలలేని పరిస్థితి రాగ చివరికి తన చేతుల్లోనే ఆమే ప్రాణం విడిచేలా ఆ విధాతతో విధిని రాయించింది.

 

                కొంత భాద్యతలనుండి  ఉపశమనం పొందిన సత్య తాను నేర్చుకున్న టైలరింగ్ సాయం తో పదిమందికి జీవనోపాదిని కల్పిస్తూ తాను లేకుండా ఒక్క నిమిషమైన వదిలి ఉండలేని భర్తను, అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చే ఆడపడుచుల (చాల మారిన) ఆప్యాయతలను, తల్లిలా చూసుకునే అల్లుడి ఆదరణను,ప్రాణం లా ప్రేమించే కొడుకు ప్రేమను ఆస్వాదిస్తూ, జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కునే ధైర్యం లేక తనతో మొరబెట్టుకునే తన టైలరింగ్ విధ్యార్థులలో స్పూర్తిని నింపుతూ పదిమందికి ఆదర్శంగా నిలిచింది.

 

                  సత్య చెప్పేదొక్కటే జీవన సాగరంలో ఆటుపోట్లు ఉన్నా ఆత్మహత్యకు ఆవగింజంతయినా చోటివ్వకూడదని.                  

 

            

 

                   

            

 

                   

                    

          

Read More

This article was posted in the below categories. Follow them to read similar posts.
LEAVE A COMMENT
Enter Your Email Address to Receive our Most Popular Blog of the Day